మణిరత్నం, గౌతమ్ మీనన్ కూడా టచ్ చేయలేని ఒక క్రేజీ కాంబినేషన్ రా ఇది.. ఆసక్తికరంగా ‘గోదారి గట్టు పైన’ మూవీ టీజర్

by Gugulothu.Kavitha |

‘మేం ఫేమ‌స్’(Mem Famous) మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సుమంత్ ప్ర‌భాస్(Sumath Prabhas) ప్రజెంట్ నటిస్తున్న సినిమా ‘గోదారి గ‌ట్టుపైన‌’(Godari Gattupaina).

మణిరత్నం, గౌతమ్ మీనన్ కూడా టచ్ చేయలేని ఒక క్రేజీ కాంబినేషన్ రా ఇది.. ఆసక్తికరంగా ‘గోదారి గట్టు పైన’ మూవీ టీజర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మేం ఫేమ‌స్’(Mem Famous) మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సుమంత్ ప్ర‌భాస్(Sumath Prabhas) ప్రజెంట్ నటిస్తున్న సినిమా ‘గోదారి గ‌ట్టుపైన‌’(Godari Gattupaina). సుభాష్ చంద్ర(Subhash Chandra) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నిధి(Nidhi) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఏసియన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత అభినవ్ రావు(Abhinav Rao) ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్రబృదం.

ఇక టీజర్‌ను గమనించినట్లయితే.. టైటిల్‌కి తగ్గ‌ట్టుగానే గోదావ‌రి నేప‌థ్యంలో సాగే లవ్‌స్టోరీలా అనిపించింది. ముగ్గురు స్నేహితుల ఆట.. పాట‌లూ, అల్ల‌ర్లు అన్నీ పల్లెటూరి వాతావరణాన్ని గుర్తు చేస్తాయి. సుమంత్ ప్ర‌భాస్ అండ్ నిధిల కెమిస్ట్రీ ఈ క‌థ‌కు ప్ల‌స్ అనే చెప్పవచ్చు. జ‌గ‌ప‌తిబాబు, లైలా, రాజీవ్ క‌న‌కాల‌.. ఇలా స్టార్ కాస్టింగ్ బాగానే ఉంది. ఇక కమెడియన్ సుద‌ర్శ‌న్ చెప్పే ‘మ‌ణిర‌త్నం, గౌత‌మ్ మీన‌న్ ట‌చ్ చేయ‌లేని క్రేజీ కాంబినేష‌న్ రా ఇది’ అనే డైలాగ్ ఫ‌న్నీగా కుదిరింది. ఫైనల్‌గా కామెడీ, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో టీజర్‌ ఆకట్టుకుంది.

Next Story