ఈ బ్రేక్ నాకు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో అవసరం: అడివి శేష్

by Mallepaka Hamsa |

గత ఏడాది కాలంగా అస్సలు ప్రశాంతత లేదు. షూటింగ్ షెడ్యూల్స్ చాలా కఠినంగా సాగాయి. ‘డెకాయిట్’ సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేసే టైమ్ కూడా దొరకలేదు.

ఈ బ్రేక్ నాకు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో అవసరం: అడివి శేష్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ‘డెకాయిట్’ చిత్రంతో సక్సెస్ సాధించిన ఆయన త్వరలో ‘గూఢచారి-2’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం కాగా.. పలు పోస్టర్లు విడుదలై అంచనాలను మరింత పెంచాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ తాను బ్రేక్ తీసుబోతున్నట్లు వెల్లడించారు. "గత ఏడాది కాలంగా అస్సలు ప్రశాంతత లేదు. షూటింగ్ షెడ్యూల్స్ చాలా కఠినంగా సాగాయి. ‘డెకాయిట్’ సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేసే టైమ్ కూడా దొరకలేదు. అందుకే ఈ బ్రేక్ తీసుకుని నా ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడపాలనుకుంటున్నాను.

ఈ బ్రేక్ నాకు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో అవసరం. నా విజయాన్ని నా వాళ్లతో సెలబ్రేట్ చేసుకుని, కొత్త ఎనర్జీతో తిరిగి వస్తాను. ఇండియాకు రాగానే ‘గూఢచారి 2’ పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్ పనుల్లో బిజీ అయిపోతాను’’ అని అన్నారు. అమెరికా ట్రిప్ ముగించుకుని ఇండియాకు తిరిగి రాగానే శేష్ మళ్లీ ఫుల్ స్పీడ్‌తో రంగంలోకి దిగనున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో రాబోతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘జి2’ షూటింగ్‌ను చాలా వేగంగా పూర్తి చేయనున్నారు. దేశం కోసం విదేశాల్లో సాగించే ఒక భారీ మిషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మూవీ షూటింగ్‌పై అడివి శేష్ మాట్లాడుతూ.. "రాబోయే వర్క్ చాలా హెవీగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే పూర్తి ఫ్రెష్ ఎనర్జీతో, సరికొత్త ఉత్సాహంతో ఆ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడతాను. కొన్నిసార్లు కాసేపు ఆగి ప్రశాంతంగా ఉండటం వల్ల మరింత బలంగా తిరిగి రావచ్చు" అని చెప్పుకొచ్చారు.

Next Story