- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ లాంచ్..
తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్.

దిశ, సినిమా: హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ మూవీతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు మేకర్స్. ఇందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. నిర్మాత కిరణ్ అబ్బవరం సినిమాపై ఆసక్తిర కామెంట్స్ చేశారు.
‘మా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్‌కి థ్యాంక్స్. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. వాళ్లు మా మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ఇంత ప్యాషనేట్ టీమ్ చేసిన సినిమాను నేను హీరోగా చేసిన సినిమాలాగే ప్రమోట్ చేస్తున్నా. మేము కష్టపడ్డామని సినిమా చూడమని చెప్పను. నేను ప్రేక్షకుల టైమ్, డబ్బుకు విలువఇస్తాను. మా మూవీ ట్రైలర్, సాంగ్స్ , కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే థియేటర్స్‌కు వెళ్లి మా టీమ్ అందరినీ సపోర్ట్ చేయండి. ఈ వేసవికి సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే.. ఈ సారి మా తిమ్మరాజుపల్లికి రండి. మీ ఊరు గుర్తుస్తుంది, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నా. మీకు తప్పకుండా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చాడు.






