శ్లోక ఎంటర్‌టైన్మెంట్స్, వైబ్రెంట్ సినిమాస్‌కే ‘తిమ్మరాజుపల్లి టీవీ’

by Chukka Sudharani |

ఈ నెల 17న శ్లోక ఎంటర్టై‌న్మెంట్స్, వైబ్రెంట్ సినిమాస్ ద్వారా ఓవర్సీస్‌లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా రిలీజ్ కాబోతున్నది.

శ్లోక ఎంటర్‌టైన్మెంట్స్, వైబ్రెంట్ సినిమాస్‌కే ‘తిమ్మరాజుపల్లి టీవీ’
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాత కొత్త ప్రయాణం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను ఓవర్సీస్‌లో శ్లోక ఎంటర్‌టైన్మెంట్స్, వైబ్రెంట్ మూవీస్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొనగా.. నిర్మాతగా ఈ చిత్రం కిరణ్ అబ్బవరానికి మంచి హిట్ ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Next Story