- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shriya Reddy: స్క్రీన్‌పై నా రోల్ చూసి ఆశ్చర్యపోతారు.. 'OG' మూవీపై హీరోయిన్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘సలార్’ (salar) చిత్రంతో టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది శ్రీయా రెడ్డి

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘సలార్’ (salar) చిత్రంతో టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది శ్రీయా రెడ్డి (Sreeya Reddy). అంతే కాకుండా ఈ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా పలు అవార్డులు కూడా అందుకుంది. ప్రజెంట్ ఈమె.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘OG’ చిత్రంలో నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించింది.
‘ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకం. గతేడాది చివర్లో వచ్చిన ‘సలార్’ సినిమాలో నా ప్రాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుంది. అలాగే ఈ ఏడాది రిలీజైన ‘తలైమై సేయలగం’ పొలికట్ లీడర్ పాత్రలో నటించా. ఇక తెలుగులో రానున్న బిగ్గెస్ట్ మూవీల్లో ఒకటైన ‘OG’లో వర్క్ చేస్తున్న. ఈ సినిమాలో స్క్రీన్‌పై నన్ను చూసి ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారు. పవన్ కల్యాణ్‌తో ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయన చాలా తెలివైన వారు. మర్యాద గల వ్యక్తి. ఆయనొక అద్భుతమైన వ్యక్తి. ఎదుటి వ్యక్తులతో ఆయన మాట్లాడే విధానం, ప్రవర్తన చాలా చక్కగా ఉంటాయి’ అని చెప్పుకొచ్చింది. అలాగే తన తదుపరి చిత్రాల గురించి చెప్తూ.. ప్రజెంట్ నేను ‘OG’లో మాత్రమే నటిస్తున్నాను. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కన్ఫార్మ్ అయితే తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.
Read More...
Anupama Parameswaran: న్యాయం కోసం అనుపమ పోరాటం.. కోర్టు బోనులో హీరోయిన్!






