- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కఠిన సమయంలో నాకు అండగా నిలిచింది వాళ్లే.. అబ్బాస్ ఎమోషనల్
హార్పిక్ యాడ్ చేయడం వల్లే నా ప్లేట్‌లోకి అన్నం వచ్చింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఆ యాడ్ కాంట్రాక్ట్ ద్వారా లభించిన డబ్బుతోనే నేను నా కుటుంబాన్ని పోషించాను.

దిశ, సినిమా: ‘ప్రేమదేశం’ సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా మారాడు అబ్బాస్. ఆ తర్వాత ప్రేమకథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంతో పాటుగా లవర్ బాయ్ అనే ట్యాగ్ దక్కించుకున్నాడు. అయినప్పటికీ కొద్ది కాలం తర్వాత అవకాశాలు తగ్గాయి. దీంతో సినిమా ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చిన అబ్బాస్ హార్పిక్ యాడ్‌లో చేశాడు. దీంతో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సిల్కర్ స్క్రీన్‌పై హ్యాండ్సమ్ హీరోగా కనిపించిన అబ్బాస్ యాడ్‌లో చూడలేకపోయిన అభిమానులు కూడా ఆందోళన చెందారు. ఆ తర్వాత ఆయన ఇండియాలోనే కనిపించలేదు. కుటుంబం కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. మళ్లీ ఇటీవల వచ్చిన జీవి ప్రకాష్ ‘హ్యాపీరాజ్’ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటుగా అభిమానుల ఆనందానికి కారణమైంది. అలాగే క్రైమ్ థ్రిల్లర్ ఎగ్జామ్ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఇది కూడా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్ చేతిలో ఒక్క సినిమా ప్రాజెక్ట్ కూడా లేని కష్టకాలంలో ఆ హార్పిక్ బ్రాండ్ తనకు దేవుడిలా అండగా నిలిచిందని అబ్బాస్ పేర్కొన్నాడు.
"హార్పిక్ యాడ్ చేయడం వల్లే నా ప్లేట్‌లోకి అన్నం వచ్చింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఆ యాడ్ కాంట్రాక్ట్ ద్వారా లభించిన డబ్బుతోనే నేను నా కుటుంబాన్ని పోషించాను. ఆర్థికంగా అంతో ఇంతో స్థిరపడగలిగాను. ఆ బ్రాండ్ యాజమాన్యం నన్ను ఎంతో సపోర్ట్ చేసింది" అని అబ్బాస్ వివరించాడు. టాయిలెట్ క్లీనర్ యాడ్ చేసినందుకు సమాజం తనను చాలా దారుణంగా ట్రోల్ చేసిందని, కానీ కుటుంబం ఆకలితో ఉన్నప్పుడు ఆ ట్రోల్స్ అన్నం పెట్టవని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. "కష్టకాలంలో ఉన్నప్పుడు మీకున్న అహాన్ని పక్కన పెట్టి, ఆహారం కోసం వేరే మార్గాలను వెతుక్కోకపోతే.. ఈ సమాజంలో ఏ ఒక్కరూ వచ్చి మీకు సహాయం చేయరు. నేను అన్ని వృత్తులను సమానంగా చూస్తాను" అని అబ్బాస్ చాలా స్పష్టంగా చెప్పారు. కడుపు నింపుకోవడానికి, కుటుంబాన్ని సాకడానికి నిజాయితీగా పని చేయడంలో ఎలాంటి తప్పు లేదని, ఈగోలను పక్కన పెట్టి బతకడమే అసలైన జీవితమని అబ్బాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






