- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Razakar: నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్’ (Razakar). యాటా సత్యనారాయణ (Yata Satyanarayana) దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి (Guduru Narayana Reddy) నిర్మించారు. గతేడాది థియేటర్స్‌లో రిలీజై మంచి విజయాన్ని అందుకున్న ‘రజాకార్’ ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ నెల 24 నుంచి ఆహా (aha) ఓటీటీలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం.
ఈ సందర్భంగా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి (Guduru Narayana Reddy) మాట్లాడుతూ.. ‘సినిమాలను డబ్బు కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేస్తుంటారు. కానీ మేము రజాకార్ సినిమాను ఒక బాధ్యతతో చేశాం. నిజాం పాలనలో రజాకార్లు సాగించిన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నం చేశాం. రేపటి తరాలు రజాకార్ల అకృత్యాలను తెలుసుకోవాలి. మరోసారి అలాంటి వారు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. కానీ నేను భయపడలేదు. సినిమాను నిర్మించాను. ఐఎండీబీలో 9.5 రేటింగ్ వచ్చింది. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో సన్మానం చేశారు. మా టీమ్, మా డైరెక్టర్ యాటా సత్యనారాయణ సపోర్ట్‌తో సినిమా సక్సెస్ పుల్‌గా ప్రేక్షకులకు రీచ్ చేయగలిగాం. ప్రజల నుంచి వచ్చిన స్పందన నాకు ఎంతో సంతృప్తిని మిగిల్చింది. ఇప్పుడు మన తెలుగు వారి ఓటీటీకే మూవీ ఇవ్వాలని ఆహాలోకి తీసుకొస్తున్నాం. ఈ నెల 24వ తేదీ నుంచి ఆహాలో మా సినిమా ప్రీమియర్‌కు వస్తోంది. మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.