- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ హీరోతో సినిమా చేస్తే సూసైడ్ చేసుకోవాల్సిందే’.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)అందరికీ సుపరిచితమే. ఆయన మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)అందరికీ సుపరిచితమే. ఆయన మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. గత ఏడాది ఉన్ని ముంకుందన్ ‘మార్కో’(Marco) సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. అలాగే భారీ కలెక్షన్లు రాబట్టి ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ‘మార్కో’ ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఉన్ని ముకుందన్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఉన్ని ముకుందన్, వినయ్ గోవింద్(Vinay Govind) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘గెట్ సెట్ బేబీ’(Get set baby). దీనిని స్వంధ సినిమాస్, కింగ్స్‌మెన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సాజీవ్ సోమన్, సామ్ జార్జ్ అబ్రహం, సునీల్ జైన్(Sunil Jain), ప్రకాష్ జైన్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి రానుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, ‘గెట్ సెట్ బేబీ’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సామ్ జార్జ్ అబ్రహం షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాము. ఓ దశలో మూవీ కంప్లీ అవుతుందా? లేదా అనే అనుమానం కూడా క్రియేట్ అయింది. ఈ సమయంలోనే హీరో ఉన్ని ముకుందన్ అందించిన సహకారం మరువలేనిది. ఆయన ఈ మూవీ కోసం అన్ని రకాలుగా సాయం చేశారు. అతను చేసిన మేలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అయితే ‘గెట్ సెట్ బేబీ’ సినిమాలో హీరోగా ఉన్ని ముకుందన్ అనుకున్న సమయంలో చాలామంది నన్ను భయపెట్టారు.
ఆయనను అసలు హీరోగా తీసుకోవద్దని హెచ్చరించారు. అతడిని తీసుకుంటే అనేక నష్టాలకు గురి అవుతుంది.. నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. కానీ వారందరికీ భిన్నంగా ఉన్న ముకుందన్ వ్యవహరించారు. నేను ఆయనతో పని చేయడం గొప్ప అనుభూతిగా భావిస్తున్నా. నా కెరీర్‌లో ఎవరూ అందించని సహాకారం ఆయనవల్ల అయింది. కొందరి మాటలు వింటే గొప్ప అవకాశాన్ని కోల్పోయే వాడినని ఉన్ని ముకుందన్‌తో వర్క్ చేశాకే అర్థం అయింది. కష్ట సమయాల్లో సాయం చేసిన మా హీరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






