నేను చేసిన పనికి ఫ్రీగా యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చారు… షాకింగ్ కామెంట్స్ చేసిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నటుడు.

by Pulgam srinivas |

లతీష్ మాట్లాడుతూ… నాలో ఉన్న పట్టుదలను చూసి ఫిలిం ఇన్‌స్టిట్యూట్ వారు నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు.

నేను చేసిన పనికి ఫ్రీగా యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చారు… షాకింగ్ కామెంట్స్ చేసిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నటుడు.
X

దిశ, వెబ్ డెస్క్: ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాతో విలన్ సిద్ధయ్యగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న లతీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన తన జీవితం గురించి అనేక విషయాలను చెప్పుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… “మాది పేద వ్యవసాయ ఆధారిత కుటుంబం. చదువు పూర్తయ్యాక కొంతకాలం ఉద్యోగం కూడా చేశాను. కానీ నాకు మొదటి నుంచే సినిమాల్లో నటించడం అంటే చాలా ఆసక్తి. అందుకే 2017లో సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లాను.

అక్కడ అనేక కష్టాలను ఎదుర్కొన్నాను. ఒక సమయంలో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్లాను. అక్కడ చేరడానికి లక్ష రూపాయలు అడిగారు. నా దగ్గర అంత పెద్ద మొత్తం డబ్బులు లేవు. దాంతో నాకు కోపం వచ్చి ‘డబ్బులున్న వారికే నటననా?’ అని ప్రశ్నించాను. నా పట్టుదలను చూసి వారు నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంలో నాకు అవకాశం వచ్చింది. ఆ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి” అని చెప్పారు.

Next Story