- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘వారికి జీవించే అర్హత లేదు’.. నటి తీవ్ర ఆగ్రహం

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగికదాడి(sexual assault) ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులు చోటుచేసుకోవడం బాధాకరం. ఇటీవల కాలంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే మానవమృగాల్లా మారుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు చేసిన పనికి సభ్యసమాజమే తలదించుకుంటుంది. తాజాగా తమిళనాడులో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో(Government School) ముగ్గురు ఉపాధ్యాయులు.. బాలిక(13)పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఈ నేపథ్యంలో తమిళనాడు(Tamilanadu)లో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు కీచక టీచర్లు అఘాయిత్యానికి పాల్పడటంపై బీజేపీ నేత(BJP Leader), నటి కుష్బూ సుందర్(Actor Kushboo Sundar) ఆగ్రహించారు. లైంగికదాడి(sexual assault)కి పాల్పడే వారికి జీవించే అర్హత లేదని నటి కుష్బూ సుందర్ అన్నారు. ఇళ్లలో(Home), వీధుల్లో(Street) , విద్యా సంస్థల్లో(educational institutions), హాస్టళ్ల(Hostels)లో ఎక్కడా పిల్లలకు రక్షణ(Protection) లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, మహిళలపై ఇలాంటివి జరగకుండా ఆపాలని సూచించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించి సమాజానికి ఓ హెచ్చరిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్(X) వేదికగా స్పందించారు.