- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG OTT: నెట్ ఫ్లిక్స్‌లోకి ఓజీ...ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే ?
ఓజీ సినిమా ఓటిటి అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైర

దిశ, వెబ్ డెస్క్ : పవర్ సార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ఓజీ. నిన్న రాత్రి నుంచే థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా.. రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. మొదటి రోజే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టేలా అంచనాలు వేస్తున్నారు. ప్రీమియర్ షో పాజిటివ్ టాక్ రావడంతో.... ఇవాళ థియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. మిరాయ్ థియేటర్లు కూడా OG కి ఇవ్వడంతో ఆ థియేటర్లు కూడా ఫుల్ అయిపోయాయి.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు విదేశాల్లో కూడా ఓజీ హవా కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓజీ సినిమా ఓటిటి అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ చేస్తున్నారు. 6 నుంచి 8 వారాల తర్వాత ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే ఈ ఓజి సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని సినిమా చివరలో... చిత్ర బృందం చింటు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. అందులో పవన్ కళ్యాణ్ ఉంటారా? లేదా? అనేది క్లారిటీ లేదని అంటున్నారు.






