పుష్ప సినిమాలో ఆ క్యారెక్టర్‌కు నన్ను అడిగి వేరొకరికి ఇచ్చారు.. యాక్టర్ శివాజీ సంచలన కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-10 03:40:30  IST  )

టాలీవుడ్ యాక్టర్ శివాజీ(Shivaji) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పుష్ప సినిమాలో ఆ క్యారెక్టర్‌కు నన్ను అడిగి వేరొకరికి ఇచ్చారు.. యాక్టర్ శివాజీ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాక్టర్ శివాజీ(Shivaji) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దీంతో బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ కూడా తన మంచితనం గేమ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చాక వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా అతను నటించిన ‘దండోర’(Dhandora) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ వస్త్రధారణ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటికీ చాలా మంది ఈ టాపిక్ మీద డిస్కషన్ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘పుష్ప’(Pushpa) సినిమాలో ఓ రోల్ కోసం నన్ను అడిగారు. నేను ఓకే చెప్పాను.. అయితే షూటింగ్‌ కోసం రేపు మార్నింగ్ వెళ్లాలి అని అనుకుంటుండగా.. తీరా నన్ను కాకుండా వేరే వాళ్లను తీసుకున్నారు. ఆ పాత్ర అతనికి వరించింది. చెప్పలేము అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో. లక్ ఉండాలి.. కానీ నేను అన్నీ పట్టించుకోను నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను. దానివల్ల ఎవరైనా ఫీల్ అయితే సారీ నా ఉద్దేశం అది కాదు అని చెప్తా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా పుష్ప సినిమాలో ఏ క్యారెక్టర్ కోసం అతన్ని సంప్రదించారో మాత్రం రివీల్ చేయలేదు.

Read More..

టాక్సిక్ టీజర్ ఊచకోత.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే..(ట్వీట్)

Next Story