టాక్సిక్ టీజర్ ఊచకోత.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే..(ట్వీట్)

by I. Sairam |

రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’.

టాక్సిక్ టీజర్ ఊచకోత.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే..(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి మెల్లిసా పాత్రలో రుక్మిణి వసంత్, నదియా పాత్రలో కియారా, ఎలిజబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార నటించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న రాకింగ్ స్టార్ యష్ బర్త్‌డే స్పెషల్‌గా టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక టీజర్‌లో ఇంటిమెంట్ సీన్స్‌తో చాలా బోల్డ్‌గా అండ్ బాంబుల మోతతో చాలా వైల్డ్‌గా అనిపించింది. ఈ క్రమంలో ఈ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 200 మిలియన్ల వ్యూస్‌తో పాటు 5.5 మిలియన్ల లైక్స్ స్వాధీనం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేసింది. ఇక పోస్టర్‌లో యష్ సిగరెట్ కాల్చుతూ గన్ షోల్డర్ పై పెట్టుకొని శవాల గుట్టమీద నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Link

Next Story