- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పచ్చి బూతులు, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు.. తట్టుకోలేకపోతున్నాను.. యంగ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్(Urfi Javed) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్(Urfi Javed) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది బిగ్ బాస్(Bigg Boss) ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎక్కువ టీవీ షోల్లోనే నటించిన ఈ ముద్దుగుమ్మ కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఆ సినిమానే ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2’. అయితే ఈ అమ్మడు పదుల సంఖ్యలో టీవీ ఈ షోలు చేసినా రానీ పాపులారిటీ డిఫెరెంట్, వెరైటీ డ్రెస్సులతో ఫుల్ ఫేమస్ అయింది. చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నది. అయితే వాటి వల్ల ఎక్కువ కాంప్లీమెంట్స్ కంటే తిట్లు, ట్రోల్స్‌కే ఎక్కువ గురయ్యేది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఉర్ఫీ జావేద్ ఓ రియాలిటీ షోలో విజేతగా నిలిచింది. దాంతో ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు ఉర్ఫీ జావేద్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారట. పిచ్చి మెసేజులు, బూతులు తిడుతూ కామెంట్స్ చేశారు. దీంతో ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో చెత్త మెసెజ్‌లు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉర్ఫీ జావేద్ పై చాలా మంది నెగిటివ్ కామెంట్స్‌తో పాటు పచ్చి బూతులు తిడుతున్నారని వాపోయింది. ఇక వీటిని తాజాగా ఉర్ఫీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక దీనిపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. Link






