- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బులిచ్చి మరీ నాపై అలా చేయిస్తున్నారు.. చాలా బాధగా ఉంది తట్టుకోలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. రీసెంట్‌గా ‘కుబేర’(Kubera) మూవీతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన ఈ భామ ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ల గురించి ఆవేదనను వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నేను అన్ని ఎమోషన్స్ ఉన్న అమ్మాయిని. కానీ అవన్నీ నేను బయట పెట్టడానికి ఇష్టపడను. అలా చేస్తే నేను కెమెరా కోసం చేశాను అని అంటున్నారు. నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు. నా ఎదుగుదలను కావాలనే అడ్డుకుంటున్నారు. బయట జనాలు క్రూరంగా ఎందుకు మారుతున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ నన్ను బాధ పెడుతున్నాయి. నాపై ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కానీ ప్రశాంతంగా ఉండండి’ అంటూ రష్మిక ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






