- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి నన్ను వారి గదికి రమ్మని పిలుస్తున్నారు.. ఇది చాలా బాధాకరం అంటూ హీరోయిన్ సెన్సేషనల్ ట్వీట్
నటి సనం శెట్టి(Sanam Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మోడల్‌గా పరిచయం అయి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: నటి సనం శెట్టి(Sanam Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మోడల్‌గా పరిచయం అయి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. అలాగే బిగ్‌బాస్ షోలో పాల్గొని తన ఆటతీరుతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక 2016లో మానస్ హీరోగా నటించిన ‘ప్రేమికుడు’(Premikudu) సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ హిట్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది. గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా, కూల్ సురేష్ హీరోగా నటిస్తున్న మూవీ ప్రారంభోత్సవానికి హాజరై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఇటీవల వచ్చిన ‘బ్యాడ్‌గర్ల్’ టీజర్ బోల్డ్ ఎగ్జాంపుల్ కాదు.. అదొక చెత్త ఉదాహరణ అని నేను అంటాను.
ఎందుకంటే.. స్వేచ్ఛ, లింగసమానత్వం అనే అంశాలను తప్పుగా చూపించారు. అబ్బాయిలతో పోటీపడి సిగరెట్, మద్యం సేవించడం సమానత్వం అనరు. సమానత్వం అంటే అన్నింటిలో సమాన అవకాశాలు ఇవ్వడం గౌరవించడం. హీరోను సంప్రదించే విధానం, హీరోయిన్లను సంప్రదించే ఒకేలా ఉండదు. ఉదాహరణకు నన్నే తీసుకోండి.. సినిమాలో నటించమని పిలవడానికి బదులు వారితో కలిసి రాత్రి గదిలో ఉండమని పిలుస్తున్నారు ఇదొక సమానత్వం అంటారా? అసలు ‘బ్యాడ్‌గర్ల్’ టీజర్ అమ్మాయిలను చెడగొట్టేలా ఉంది. బాధ్యతాయుతమైన చిత్ర నిర్మాతలు ఈ చిత్రానికి నిధులు సమకూర్చడం మద్దతు ఇవ్వడం పట్ల తీవ్ర నిరాశ చెందాను. మీరు నాతో ఏకీభవిస్తారా?’’ అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.
#BADGIRL Teaser is NOT a BOLD Example.. ❌
— Sanam Shetty (@ungalsanam) February 18, 2025
It's a #BAD Example! 👎#Freedom of choice and #GenderEquality concepts are wrongly portrayed in case of #Minors here! #Legally, #Ethically and even #Medically it sends a terribly #wrong message to the already influencable adolescent… pic.twitter.com/Dv6pVdXxtG






