TALENTED HEROS: ఈ కుర్ర హీరోల టాలెంట్ స్టార్ హీరోల కంటే ఎక్కువే

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-20 09:18:16  IST  )

టాలీవుడ్ లోని కొందరు కుర్ర హీరోలు మాత్రం నటించడం వరకే పరిమితం అవ్వకుండా తమ కథలు తామే రాసుకుంటూ, స్టోరీ మరియు డైలాగ్స్ రాస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వాళ్ల టాలెంట్ తో హిట్లు కొడుతూ స‌రికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.

TALENTED HEROS: ఈ కుర్ర హీరోల టాలెంట్ స్టార్ హీరోల కంటే ఎక్కువే
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ఐదారుగురు స్టార్ హీరోలు ఉన్నారు. వీళ్ల నుండి సినిమా వచ్చిందంటే పక్కా స్టార్ డైరెక్టర్లు, పాన్ ఇండియా, వందల కోట్ల బడ్జెట్, పక్కన స్టార్ హీరోయిన్లు ఉండాల్సిందే. అయితే ఈ హీరోలు కేవలం నటనకు మాత్రమే పరిమితం అవుతుంటారు. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామా.. అందులో డ్యాన్సులు, ఫైట్లు అదరగొట్టామా అన్నంతవరకే పరిమితం అవుతారు. కానీ టాలీవుడ్ లోని కొందరు కుర్ర హీరోలు మాత్రం నటించడం వరకే పరిమితం అవ్వకుండా తమ కథలు తామే రాసుకుంటూ, స్టోరీ మరియు డైలాగ్స్ రాస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వాళ్ల టాలెంట్ తో హిట్లు కొడుతూ స‌రికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. దీంతో ఆ హీరో పేరు వినిపిస్తే చాలు ప్రేక్ష‌కులు ఎలాంటి సందేహం లేకుండా సినిమాకు వెళుతున్నారు. అలాంటి టాలెంటెడ్ హీరోల లిస్టులో ముఖ్యంగా ఐదుగురు ఉన్నారు.

అడవి శేష్

ఫారిన్ నుండి వ‌చ్చి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అడవి శేష్ ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌కు క‌థ‌లు రాశాడు. సొంత స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడు. అంతేకాకుండా త‌న రాబోయే సినిమా డెకాయిట్ మ‌రియు జీ2కు సైతం అత‌డే రచ‌యితగా మ‌రియు స్క్రీన్ ప్లే రైట‌ర్ గా ప‌నిచేస్తున్నాడు.

విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వ‌క్ కూడా అలాంటి వాడే.. ఇప్ప‌టికే విశ్వ‌క్ ఫ‌ల‌క్ నమా దాస్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డమే కాకుండా తనే నిర్మించాడు. ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇక త‌న త‌ర‌వాత సినిమా క‌ల్ట్ కు సైతం విశ్వ‌క్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

నవీన్ పొలిశెట్టి

జాతిర‌త్నాలు సినిమాతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన న‌వీన్ పొలిశెట్టి సైతం త‌న సినిమాల్లో డైలాగులు రాయ‌డంతో పాటు క‌థ‌లు రాయ‌డం, స్క్రీన్ ప్లే రాస్తూ అద‌ర‌గొడుతున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి హిట్ కొట్టిన అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాకు న‌వీన్ క‌థ‌తో పాటు డైలాగ్స్ మ‌రియు స్క్రీన్ ప్లే అందించాడు.

డీజే టిల్లు

డీజే టిల్లుతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ది కూడా అదే దారి. సిద్దు న‌టించిన డీజే టిల్లు సినిమాకు మాట‌లు రాశాడు. త‌ర‌వాత టిల్లు స్కేర్ సినిమాకు క‌థ‌ను అందించ‌డంతో పాటు మాట‌లు రాశాడు. ఇక త‌ర‌వాత రాబోయే టిల్లు క్యూబ్ సినిమాకు ర‌చయిత‌గా మ‌రియు స్క్రీన్ ప్లే రైట‌ర్ గా ప‌నిచేస్తున్నాడు.

Next Story