అత్యధిక సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న టాప్ 9 తెలుగు హీరోలు వీరే.?

by Pulgam srinivas |

ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అత్యధిక సార్లు అందుకున్న టాప్ 9 హీరోలలో చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, శోభన్ బాబు, వెంకటేష్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు.

అత్యధిక సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న టాప్  9 తెలుగు హీరోలు వీరే.?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఈ అవార్డులను ఇప్పటివరకు ఎంతోమంది తెలుగు హీరోలు అందుకున్నారు. మరి ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అత్యధిక సార్లు అందుకున్న ఆ టాప్ 9 హీరోలు ఎవరు? ఎన్నిసార్లు అందుకున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి - అల్లు అర్జున్

వీరిద్దరూ ఇప్పటివరకు ఏడుసార్లు ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును అందుకున్నారు.

మహేష్ బాబు

ఇప్పటివరకు ఐదుసార్లు ఈ అవార్డును అందుకున్నాడు.

శోభన్ బాబు - వెంకటేష్

ఈ ఇద్దరు హీరోలు చెరో నాలుగుసార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు - కృష్ణంరాజు - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్

ఈ నలుగురు హీరోలు చెరో మూడుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దక్కించుకున్నారు.

Next Story