- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్ లో విడుదల కానున్న తెలుగు సినిమాలు ఇవే!
పదో తరగతి పరీక్షలు ముగుస్తాయి. వారం తర్వాత పిల్లల పరీక్షలు కూడా అయిపోతాయి.

దిశ, వెబ్ డెస్క్: పదో తరగతి పరీక్షలు ముగుస్తాయి. వారం తర్వాత పిల్లల పరీక్షలు కూడా అయిపోతాయి. అందరికి సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. సమ్మర్‌లో థియేటర్స్‌కి ఫ్యామిలీలు బాగా వస్తారు.. కాబట్టి తమ సినిమాలని ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఏప్రిల్ 10న సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’తో సమ్మర్ వార్ షురూ అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై ఎంటర్ టైనర్ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీకి పోటీగా అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 11న యాంకర్ ప్రదీప్ నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ విడుదల అవుతుంది. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ తర్వాతి వారంలో అంటే ఏప్రిల్ 17న మిల్క్ బ్యూటి తమన్నా నటించిన ‘ఓదెల 2’ రిలీజ్ కానుంది. మరుసటి రోజు ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ రిలీజ్ కానుండగా, దీని మీద బజ్ అయితే అంతగా లేదు.అయితే పాన్ ఇండియా మూవీస్ అయిన ఘాటీ, కన్నప్ప వాయిదా పడటం చిన్న సినిమా వాళ్లకి కొంత ఊరటనిచ్చింది అని చెప్పాలి.






