ఇవి మిస్ అయిపోయాయే!.. నెట్టింట వైరల్‌గా అనగనగా డిలీటెడ్‌ సీన్స్‌

by Yella Dhawani Reddy |

టాలీవుడ్ హీరో సుమంత్ హీరోగా, కాజల్ చౌదరి హీరోయిన్‌గా సన్నీ సంజయ్ తెరకెక్కించిన తాజా చిత్రం 'అనగనగా'.

ఇవి మిస్ అయిపోయాయే!.. నెట్టింట వైరల్‌గా అనగనగా డిలీటెడ్‌ సీన్స్‌
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో సుమంత్ హీరోగా, కాజల్ చౌదరి హీరోయిన్‌గా సన్నీ సంజయ్ తెరకెక్కించిన తాజా చిత్రం 'అనగనగా'. ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. నేటి విద్యావ్యవస్థలోని లోపాలను, దాని తీరుతెన్నులను ప్రశ్నిస్తూ, తండ్రీ-కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని దర్శకుడు ఎంతో చక్కగా భావోద్వేగభరితంగా చూపించారు. ఇంటిల్లి పాది హాయిగా చూసుకునేలా ఈ సినిమా ఉందంటూ, ఇందులోని ప్రతి సన్నివేశం ఆలోచింపచేసే విధంగా ఉన్నాయంటూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ డిలీటెడ్ సీన్స్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇందులో వ్యాస్‌ని రామ్.. డాడీ ఓ కథ చెప్పవా అంటూ అడగ్గా.. సింబా-ముఫాసా కథ చెప్పడం జరుగుతుంది. మరో సన్నీవేశంలో రామ్ చదువు గురించి భాగీ బాధపడుతుంటే వ్యాస్ తనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఇక ఈ డిలీటెడ్ సీన్స్ చూసిన నెటిజన్స్.. 'ఇవి కూడా సినిమాలో పెట్టి ఉంటే ఎంత బాగుండేది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరీ ఎందుకు ఆలస్యం ఆ డిలీటెడ్ సీన్లను మీరు కూడా చూసేయండి.

Next Story