- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
ఈ వారం కూడా పెద్ద హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. థియేటర్లు అదే సమయంలో OTTలో కూడా వినోదకరమైన

దిశ, వెబ్ డెస్క్: ఈ వారం కూడా పెద్ద హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. థియేటర్లు అదే సమయంలో OTTలో కూడా వినోదకరమైన సినిమాలు రాబోతున్నాయి. ముందుగా అక్టోబర్ 31వ తేదీన బాహుబలి రీ-రిలీజ్ కాబోతుంది. రెండు పార్ట్ లను కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మూడు గంటల 44 నిమిషాల రన్ టైం కలిగి ఉంటుంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ, శ్రీ లీల కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా మాస్ జాతర. ఈ సినిమా నవంబర్ ఒకటో తేదీన ప్రేక్షకులకు ముందుకు రాబోతుందట. అక్టోబర్ 31 సాయంత్రం నుంచి ప్రత్యేక షోలు ఉంటాయని టాక్. ఇక కర్మణ్యే వాధికారస్తే మూవీ అక్టోబర్ 31వ తేదీన థియేటర్ లో రిలీజ్ కానుంది. ది తాజ్ స్టోరీ కూడా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కు సిద్ధమైంది.
OTT లో రిలీజ్ కాబోయే సినిమాలు
ఇడ్లీ కొట్టు మూవీ అక్టోబర్ 29వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ది అస్సెట్ ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కానుండగా, అలిన్ ఇదే నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 30వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. హెడ్డా మూవీ అక్టోబర్ 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. లోక చాప్టర్ 1 మూవీ జియో హాట్ స్టార్ లో అక్టోబర్ 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సన్ నెక్స్ట్ లో బ్లాక్ మెయిల్ అనే సినిమా అక్టోబర్ 30వ తేదీన రాబోతుంది. అంటే ఓటీటీలో ఈ వారం ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు సినిమా మినహా పెద్ద సినిమాలు ఏవీ లేవు అన్నమాట.






