ఈ వారం థియేట‌ర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

by velandi.Saikiran |

హీరోయిన్ ర‌ష్మిక సినిమా కూడా ఉంది. ర‌ష్మిక‌, దీక్షిత్ శెట్టి కాంబోలో వ‌స్తున్న మూవీ ది గ‌ర్ల్ ఫ్రెండ్‌.

ఈ వారం థియేట‌ర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్ : ప్ర‌తీ వారంలాగానే ఈ వారం కూడా థియేట‌ర్ల‌లో అలాగే ఓటీటీలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో హీరోయిన్ ర‌ష్మిక సినిమా కూడా ఉంది. ర‌ష్మిక‌, దీక్షిత్ శెట్టి కాంబోలో వ‌స్తున్న మూవీ ది గ‌ర్ల్ ఫ్రెండ్‌. ఈ సినిమా న‌వంబ‌ర్ 7వ తేదీన రిలీజ్ కానుంది. అలాగే సుధీర్ బాబు, సోనాక్షి కాంబోలో జ‌టాధ‌ర ( Jatadhara Movie) సినిమా రానుంది. సోనాక్షికి ఈ మూవీ తొలి తెలుగు సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ మూవీ తెలుగు, హిందీ భాష‌ల్లో న‌వంబ‌ర్ 7వ తేదీనే థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కూడా థియేట‌ర్ల‌లో న‌వంబ‌ర్ 7వ తేదీన‌ రిలీజ్ కానుంది. ఇక ఓటీటీ విష‌యానికి వ‌స్తే, బ్యాడ్ గ‌ర్ల్ న‌వంబ‌ర్ 4న‌, ది ఫాంటాస్టిక్ 4 నవంబ‌ర్ 5న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌ కానుంది. రాబిన్ హుబ్ వెబ్ సిరీస్ నిన్న‌టి నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇవాళ్టి నుంచి నైన్ టూ నాట్ మీట్ యూ అనే వెబ్ సిరీస్ అమెజాన్ లో వ‌స్తోంది. మ‌హారాణి అనే వెబ్ సిరీస్ న‌వంబ‌ర్ 7న సోనీలివ్ స్ట్రీమింగ్ కానుంది. ఇన్ వేవ్స్ అండ్ వార్ నెట్ ఫ్లిక్స్ లో వ‌స్తోంది.

Next Story