- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిట్ పడినా పత్తాలేకుండా పోయిన సీక్వెల్స్ ఇవే
బింబిసార, దేవర పార్ట్ 1 చిత్రాలు మంచి విజయాలను అందుకోవడంతో వీటికి సీక్వెల్స్ ఉంటాయని చాలామంది భావించారు. ఈ మూవీలు విడుదలై చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ కూడా ఈ సినిమాలకు సీక్వెల్స్ స్టార్ట్ కాలేదు.

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. అనేక మూవీలకి చివరన సీక్వెల్ కి అవకాశం ఉండేలా మూవీని ఎండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ సినిమా మంచి విజయం సాధిస్తే ఆ పాయింట్తో మరో చిత్రాన్ని రూపొందించడానికి మేకర్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. అదే మొదటి భాగం ఫెయిల్యూర్ అయితే సీక్వెల్స్ ఆలోచనను విరమించుకుంటున్నారు. సీక్వెల్స్ రూపొందించడం కోసమే పక్కా ప్లానింగ్ తో కొంతమంది మేకర్స్ ఉంటే, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రెండు మంచి విజయాలు సాధించిన సినిమాలకు సీక్వెల్స్ ను అనౌన్స్ చేసి కూడా ఇప్పటివరకు వాటిని ప్రారంభించలేదు.
కళ్యాణ్ రామ్, మల్లాడి వశిష్ట దర్శకత్వంలో బింబిసార అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి కొనసాగింపుగా బింబిసార 2 ఉంటుందని వార్తలు గట్టిగా వైరల్ అయ్యాయి. బింబిసార కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని చాలామంది భావించారు. కానీ ఈ చిత్రం విడుదల అయ్యి చాలాకాలం అవుతున్నా సీక్వెల్ మాత్రం ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వశిష్ట, చిరంజీవి హీరోగా విశ్వంభర మూవీని రూపొందిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఈ సినిమా చివరన దేవర పార్ట్ 2 ఉండబోతుందని ప్రకటించారు. దాంతో దేవర మొదటి భాగం విడుదల అయిన కొంతకాలానికే రెండవ భాగం ప్రారంభం అవుతుందని చాలామంది భావించారు. కానీ తారక్ ఈ సినిమా విడుదల అయిన తర్వాత పలు సినిమాలకు కమిట్ అయ్యాడు. దాంతో ఇప్పటివరకు దేవర పార్ట్ 2 మూవీ స్టార్ట్ కాలేదు. మరికొంత కాలంలోనే ఈ మూవీని స్టార్ట్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. హిట్ అయిన కూడా ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ స్టార్ట్ కాకపోవడంతో ఈ హీరోల అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు.






