- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కపుల్ ఫ్రెండ్లీకి పది రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే.. గట్టిగానే కొట్టింది
కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 12.67 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా కపుల్ ఫ్రెండ్లీ అనే చిత్రం రూపొందింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, యోగిబాబు తదితరులు నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దాంతో ఇప్పటివరకు ఈ చిత్రం గట్టిగానే కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకు సంబంధించిన పది రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తయింది. ఈ పది రోజుల్లో ఈ ఎంటర్టైనర్ కి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే విషయాలను తెలియజేస్తూ ఈ మూవీ యూనిట్ ఒక పోస్టర్ను విడుదల చేసింది.
తాజాగా కపుల్ ఫ్రెండ్లీ మేకర్స్ ఈ చిత్రానికి పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 12.67 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ను కనబరుస్తూ ఉండడంతో మరికొన్ని రోజులు ఈ చిత్రం సూపర్ వసూళ్లను రాబడుతుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా సంతోష్ శోభన్ నటుడిగా కెరీర్ను మొదలుపెట్టి చాలా కాలమే అవుతున్నా ఈయనకు కపుల్ ఫ్రెండ్లీకి ముందు ఒక్క కమర్షియల్ విజయం కూడా లేదు. అలాంటి ఈ హీరోకి ఈ సినిమా చాలా పెద్ద ఊరట అని అనేక మంది భావిస్తున్నారు.






