టాలీవుడ్ లవ్ కపుల్స్ వీరే

by Pulgam srinivas |   (  Updated:2026-02-15 10:08:03  IST  )

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమించి పెళ్లి పీటలెక్కిన నటీనటులు వీరే... నాగార్జున - అమల, శ్రీకాంత్ - ఊహ, రాజశేఖర్ - జీవిత, మహేష్ బాబు - నమ్రత, నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.

టాలీవుడ్ లవ్ కపుల్స్ వీరే
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన నటులు వేరే రంగానికి సంబంధించిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది అనేకమంది జీవితాలలో జరిగింది. కానీ ఇద్దరు సినిమా ఇండస్ట్రీలోనే ఉండి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో కాస్త తక్కువగానే ఉంది. అలా ఒకే ఇండస్ట్రీలో ఉండి ప్రేమ వివాహం చేసుకొని ఇప్పటికీ అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్న ప్రేమ జంటలు ఏవి అనేది తెలుసుకుందాం.

నాగార్జున - అమల

వీరిద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన దశలో కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 1992 జూన్ 11వ తేదీన జరిగింది. ఇప్పటికీ వీరు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

శ్రీకాంత్ - ఊహ

వీరు సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. 1997వ సంవత్సరం వీరి వివాహం జరిగింది.

జీవిత - రాజశేఖర్

వీరి వివాహం చెన్నైలో 1991 జూలై 10వ తేదీన జరిగింది.

మహేష్ బాబు - నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కెరీర్ సూపర్ జోష్‌లో ఉన్న సమయంలో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 2005లో వీరి పెళ్లి జరిగింది. వీరికి గౌతమ్, సితార ఇద్దరు సంతానం కలరు. ఇప్పటికీ వీరి వివాహ బంధం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది.

నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల

వీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమలో పడ్డారు, ఇరువర్గాల పెద్దలను ఒప్పించి 2024 డిసెంబర్ 4న వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

వీరు చాలాకాలం నుండి ప్రేమలో ఉన్నారు. కొంతకాలం క్రితం ఇరువర్గాల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

'ధురంధర్'లో విలన్ పాత్రను రిజెక్ట్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

Next Story