- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ధురంధర్'లో విలన్ పాత్రను రిజెక్ట్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున
ధురందర్ మూవీలో అక్షయ్ కన్నా పాత్రకు మొదట నాగార్జునను అనుకున్నట్లు ఒక వార్త వైరల్ అయింది. తాజాగా దీనిపై నాగార్జున స్పందిస్తూ.. "నన్ను ధురంధర్ చిత్రంలో ఏ పాత్రకు సంప్రదించలేదు, అవి కేవలం రూమర్స్ అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోగా నటించడం కంటే కూడా ఇతర సినిమాల్లో కీలక, విలన్ పాత్రల్లో నటించడంపై చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. నాగ్ ఇప్పటికే బ్రహ్మాస్త్ర, కుబేర, కూలీ సినిమాల్లో నటించాడు. ఈ మూడు చిత్రాల్లోని నాగార్జున నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ హీరో తన 100వ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. తనకు సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు రెండు విజయాలను అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ నటుడు తన 100వ సినిమా చేయనున్నాడు.
ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తన నెక్స్ట్ చిత్రంపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన సమయంలో ఆయనకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. పోయిన సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన విడుదల అయిన ధురంధర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కన్నా విలన్ పాత్రలో నటించాడు. అక్షయ్ ఖన్నా పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.
ఈ చిత్రం విడుదల అయిన తర్వాత ధురంధర్ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్ ఈ చిత్రంలో అక్షయ్ కన్నా పాత్రకు నాగార్జునను అనుకున్నట్లు, అందులో భాగంగా ఆయనను సంప్రదించగా కొన్ని కారణాలతో నాగార్జున ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అయ్యింది. తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ... తనను దురంధర్ చిత్రంలో ఏ పాత్రకు సంప్రదించలేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమేనని, ఏదేమైనా ధురంధర్ అద్భుతంగా ఉందని నాగార్జున తెలియజేశారు.






