- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ‘పెద్ది’ ప్రెస్ మీట్.. కీలక ప్రకటన రానుంది
పెద్ది’ యూనిట్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు, అందులో సినిమా విడుదల తేదీపై పూర్తి స్పష్టత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రాన్ని మొదట మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రెండు తేదీల్లో కూడా ఈ సినిమా విడుదల కాలేదు. గత కొంతకాలంగా ఈ సినిమాను జూన్ 4 లేదా 25 తేదీలలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సనా ఒక సినిమా ఈవెంట్‌లో ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్ 4న ‘టాక్సిక్’ విడుదల ఉండడంతో అప్పటికే ‘పెద్ది’ పనులు పూర్తయినా కూడా ఈ సినిమాను జూన్ 25కు వాయిదా వేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రం జూన్ 4న విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ‘పెద్ది’ యూనిట్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్‌లో ముఖ్యంగా సినిమా విడుదల తేదీపై మేకర్స్ పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అందువల్ల రేపు జరిగే ప్రెస్ మీట్‌లో ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేస్తారా? లేదా జూన్ 25న విడుదల చేస్తారా? అన్నదానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంధు, శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






