- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దితో మరోసారి సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయిన చరణ్
పెద్ది సినిమాలో చరణ్ మూడో లుక్‌లో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకు జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో చరణ్ రెండు విభిన్న లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒక దాంట్లో ఊర మాస్ స్టైల్‌లో క్రికెట్ ఆటగాడిగా కనిపిస్తే, మరో లుక్‌లో పహిల్వాన్‌గా కనిపించాడు. దీంతో ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని అభిమానులు భావించారు. అయితే ఇప్పుడు మరో సర్ప్రైజ్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్ మూడో లుక్‌లో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.
అది కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్. ఈ మూడో లుక్‌ను సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ 25న విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాంధు కీలక పాత్రల్లో కనిపించనుండగా, సంగీతాన్ని ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలయ్యతో శేఖర్ కమ్ముల.. అనెక్స్‌పెక్టెడ్ కాంబో సెట్ అయ్యిందా?






