- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యతో శేఖర్ కమ్ముల.. అనెక్స్‌పెక్టెడ్ కాంబో సెట్ అయ్యిందా?
బాలయ్య–శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా వచ్చే అవకాశముందన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ, క్లాస్ సినిమాలకు పెట్టింది పేరైన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇలా ఈ ఇద్దరి దారులు పూర్తిగా భిన్నం. ఇలాంటి విభిన్న శైలుల కలయికలో సినిమా వస్తుందని తెలుగు ప్రేక్షకులు సాధారణంగా ఊహించరు. అయితే ఈ అనూహ్య కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల, బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు, ఆయనను సరికొత్త పాత్రలో చూపించే విధంగా స్క్రీన్‌ప్లేను రూపొందిస్తున్నట్లు సమాచారం.
అన్ని అనుకూలిస్తే ఈ ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ–శేఖర్ కమ్ముల కాంబో అనే ఆలోచనకే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల, కొరటాల శివలతో సినిమాలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.






