- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ ‘వార్-2’ గురించి వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. నాగవంశీ షాకింగ్ ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(ntr) గత ఏడాది ‘దేవర’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(ఎన్టీఆర్) గత ఏడాది ‘దేవర’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి ‘డ్రాగన్’(Dragon)అనే పేరు పెట్టాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో ఎన్టీఆర్ తరసన రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాను మైత్రీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే బ్లాక్ బస్టర్ హిట్ ‘దేవర’ తర్వాత ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం కావడం విశేషం. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్ ఇస్తూ అంచనాలను రెట్టింపు చేస్తున్నారు. అయితే ఈ మూవీ జూన్ 25న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ ‘వార్-2’లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘వార్’ కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. ‘‘తారక్ అన్న అభిమానులందరికీ నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము WAR 2 హక్కులను కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మా ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైనా అధికారికంగా మా స్వంత హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంది’’ అని రాసుకొచ్చారు.
To all Tarak anna fans… The news going around about us buying the rights to WAR 2 is not true. Anything related to our projects will always be announced officially through our own handles only.
— Naga Vamsi (@vamsi84) April 30, 2025






