Nagababu: ఆ రెండు విషయాల్లో మహేష్ బాబును బీట్ చేసే వారు లేరు.. నాగబాబు షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు(Nagababu) ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా హీరోగా కూడా చేసి ప్రేక్షకులను అలరించారు.

Nagababu: ఆ రెండు విషయాల్లో మహేష్ బాబును బీట్ చేసే వారు లేరు.. నాగబాబు షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు(Nagababu) ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా హీరోగా కూడా చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక తండ్రి పాత్రలో నాగబాబు చెరగని ముద్ర వేసుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. చివరగా నాగబాబు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘గీతా గోవిందం’(Geetha Govindam) సినిమాలో తండ్రిగా నటించి మెప్పించాడు. అంతేకాకుండా నిర్మాతగానూ పలు మూవీస్ తెరకెక్కించారు. కానీ గత కొద్ది రోజులు నుంచి ఇండస్ట్రీకి దూరం అయి.. రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరో అంటే ఇండస్ట్రీలో ఎవరైనాఉన్నారంటే అది మహేష్ బాబు మాత్రమే. ఆయనకి ఉన్నంత లేడీస్ ఫాలోయింగ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేదు. ఇక అందంలో ఆయనకి పోటీ ఇచ్చే మగాడు కూడా లేరు. మా భార్య మహేష్ బాబుకు పెద్ద అభిమాని. తన తమ్ముడిగా భావిస్తుంది. చిన్నతనంలో మహేష్ బాగా లావుగా ఉండేవాడు.. సన్నగా నాజూగ్గా మారేందుకు అతను చాలా కష్టపడేవాడు.

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో నాన్‌స్టాప్‌గా పరుగెత్తుతూ ఉండేవాడు. ఏదైనా అనుకుంటే సాధించి తీరే వరకు నిద్రపోని గుణం మహేష్ బాబులో ఉంది. ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అందం, ఫేమ్ విషయంలో ఆయనను బీట్ చేసే వారు లేరు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మహేష్ బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, సూపర్ స్టార్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘గుంటూరు కారం’ మూవీతో ప్రేక్షకులను అలరించారు. కానీ విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ‘SSMB-29’ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Next Story