ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువగా ఉంటుంది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో ‘కింగ్డమ్’(Kingdom) అనే మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువగా ఉంటుంది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో ‘కింగ్డమ్’(Kingdom) అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోలు, సాంగ్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈ మూవీ మే 30న థియేటర్లలోకి రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడి జులై 4న రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్‌గా మూవీటీమ్ వెల్లడించింది.

ప్రస్తుతం విజయ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అక్కడ ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘కింగ్డమ్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. అయితే ఈ మూవీను ఫ్రాంచైజీగా తీసుకు రావట్లేదు.. ముందుగా ఒక కథతో వస్తున్నాం సినిమా హిట్ అయితే సీక్వెల్స్ గురించి ఆలోచిద్దాం అని అనుకున్నాం.. అందుకే కింగ్ డమ్-1 అని టైటిల్ పెట్టలేదు. గౌతమ్ నాకు రెండు కథలు చెప్పాడు.. వాటిలో కింగ్ డమ్ యాక్షన్ డ్రామా కాబట్టి నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువ ఉంటుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story