- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ఇండస్ట్రీలో పెద్ద దిక్కులు, పదవులు ఉండవు: తమ్మారెడ్డి భరద్వాజ సెన్సేషనల్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో ‘పెద్ద దిక్కు’ అనే హోదా కేవలం చేసే పనుల వల్ల మాత్రమే వస్తుందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘పెద్ద దిక్కు’ ఎవరనే చర్చ గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అని, ఇక్కడ ‘పెద్ద దిక్కు’ అనే పదవులు లేదా ప్రత్యేక హోదాలు ఉండవని తమ్మారెడ్డి అన్నారు. ఎవరికి వాళ్లు చేసే పనులను బట్టి, సమస్యలు వచ్చినప్పుడు స్పందించే తీరును బట్టే వారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఎదుగుతారని తెలిపారు. అంతేకానీ, ఎవరినో పిలిచి ఆ పదవిలో కూర్చోపెట్టడం సాధ్యం కాదని తమ్మారెడ్డి కామెంట్ చేశారు.
ఇండస్ట్రీలో పెద్ద దిక్కు లేనట్లే..
ఇది వరకు ఒకాయన ఉండేవారు.. ఆయన చేసిన పనుల వల్లే ఆయన అందరికీ పెద్ద దిక్కయ్యారని ఇండైరెక్ట్‌గా దర్శకరత్న దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao)ను తమ్మారెడ్డి భరద్వాజ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రాలో ప్రతి చిన్న సమస్యకు ఆయన స్పందించేవారని అన్నారు. ఇవాళ ఆయన లేరు కాబట్టే, ఇండస్ట్రీలో పెద్ద దిక్కు లేనట్లే అనిపిస్తుందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సమస్య ఏదైనా సరే, తనది కాని విషయంలో కూడా చొరవ తీసుకుని పరిష్కరించే గుణమే ఒకరిని అందరివాడిగా మారుస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.






