- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Valentine's Day : మనసారా లవ్ చేస్తే మోసం చేయడమేనా ప్రేమంటే..?
ఆమే తన సర్వస్వం అని మనసారా ప్రేమించిన యువకులను నిలువునా మోసం చేసి మరో యువకుడితో జల్సాలు చేయడమేనా ప్రేమంటే..?

దిశ, సినిమా: ప్రేమ ప్రపంచాన్నే మరిపిస్తుంది. స్వర్గంలో తేలే అనుభూతిని పంచుతుంది. ఈ ప్రేమ ప్రయాణం కొందరికి పూలదండలై పెళ్లి పీటల వరకు తీసుకెళ్తే.., మరికొందరికి మనసునిండా గాయాలు చేసి కన్నీటి స్మృతులను మిగుల్చుతుంది. ఆకాశమంత ఆశతో మొదలైన ప్రేమ దూరమైనప్పుడు కలిగే గుండె కోత, ఆ నిశ్శబ్ద రోదనను కేవలం అనుభవించిన వారికే తెలుస్తుంది. తెలుగు సినీ ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథలు వెండితెరను మురిపించాయి. అందరు దర్శకులు ప్రేమికుల పెళ్లితో శుభం కార్డు వేస్తారు. కానీ, అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉండవు.. కొన్ని కథలు కన్నీటితోనే ముగుస్తాయి అనే కఠిన సత్యాన్ని కొందరు దర్శకులు మాత్రమే ఆవిష్కరించగలరు. అందుకే గెలిచిన ప్రేమ కథలు ఇచ్చే ఆనందం కంటే, ఓడిపోయిన ప్రేమ కథలు మిగిల్చే భారమే ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. ప్రేమ దక్కక, ఇష్టమైన మనిషి దూరమై, విషాదాంతంతో ముగిసిన కొన్ని అద్భుతమైన తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం...
ఆర్ఎక్స్ 100 : కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ ప్రేమించుకుంటారు. కానీ ఇందులో హీరోయిన్ పాత్ర హీరో ఫిజిక్‌పై మోజుతో తన అసరాలను తీర్చుకునేందుకు ప్రేమ అనే ముసుగు ధరిస్తుంది. కానీ ఎంతో సిన్సియర్‌గా ప్రేమించిన హీరో మాత్రం ఆమె రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తాడు. అయితే ఫైనల్‌గా తన ప్రేయసి మోశాన్ని తెలుసుకున్న హీరో తీసుకున్న నిర్ణయం సినిమా చూసే వాళ్లకు హార్ట్ బ్రేకింగ్‌గా ఉంటుంది.
బేబీ : ఆనంద్ దేవరకొండ, విరాట్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా నేటి యువతరానికి కరెక్ట్ సింక్‌లో ఉంటుంది. ఇందులో హీరో ఆనంద్ హీరోయిన్ వైష్ణవిని ఎంతో సిన్సియర్‌గా లవ్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఆనంద్‌ను సిన్సియర్‌గానే లవ్ చేస్తుంది. కానీ సినీ లైఫ్‌కు ఎట్రాక్ట్ అయిన హీరోయిన్, ఇంకో హీరో అయిన విరాట్‌తో సైతం ప్రేమాయణం నడిపించి ఫిజికల్‌గా కూడా కమిట్ అవుతుంది. ఇలా వీరిద్దరిని లవ్ చేసిన అమ్మాయి చివరకు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కిన ఈ లవ్ బ్రేకింగ్ మూవీ నేటి యువతను ఎంతగానో ఆకట్టుకుంది.
కలర్ ఫొటో : 1990ల నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ ప్రేమకథ చిత్రమే ‘కలర్ ఫొటో’. నల్లగా ఉండే జయకృష్ణ (సుహాస్), తెల్లగా ఉండే దీప్తి (చాందిని చౌదరి) కాలేజ్ టైమ్‌లో ప్రేమించుకుంటారు. కానీ, దీప్తి సోదరుడు (సునీల్) రంగు వివక్ష, కుల వివక్షతో వారి ప్రేమను అంగీకరించడు. చివరకు ఈ జంట ఎదుర్కొన్న విషాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఫైనల్‌గా వీరి ప్రేమ విషాదాంతంగా ముగుసి ప్రతి ఒక్కరి కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది.
నిన్ను కోరి : నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. ఇందులో హీరోహీరోయిన్స్ ఎంతో సిన్సియర్‌గా ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల చేత నివేదా, ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుంటుంది. అలా ఈ సినిమాలో నాని, నివేదా ప్రేమ విఫలం అవుతుంది. కానీ క్లైమాక్స్‌లో మాత్రం ఓ మంచి మెసేజ్‌ను యువతకు అందిస్తుంది.
తేరే ఇష్క్ మే: ధనుష్, కృతి సనన్ జంటగా, ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'తేరే ఇష్క్ మే'. 2025 వచ్చిన ఈ ఫుల్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా రాంఝనా తరహాలో ప్రేమ, త్యాగం అండ్ పగ చుట్టూ తిరుగుతుంది. శంకర్ (ధనుష్) చాలా కోప స్వభావం కలవాడు. అతను ప్రేమించిన అమ్మాయి (కృతి సనన్) కోసం తన జీవితాన్ని, ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. ఈ ప్రయాణంలో తను అనుభవించే వేదన, అతనిలోని తీవ్రత ఈ చిత్రంలో ప్రధానాంశంగా ఉంటుంది. ఇక ఇందులో ధనుష్, కృతి సనన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులచే ప్రశంసలు పొందాయి.






