- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనితో పారిపోయిన యంగ్ హీరోయిన్.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన పెళ్లి పంచాయితీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ వామికా గబ్బి(wamiqagabbi) ‘బిట్టోబాస్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ వామికా గబ్బి(wamiqagabbi) ‘బిట్టోబాస్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తెలుగులో ఈ అమ్మడు సుధీర్ బాబు నటించిన ‘భలే మంచి రోజు’ సినిమాలో నటించి తన అందం, అభినయంతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఇటీవల ‘బేబీ జాన్’మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం వామికా గబ్బి అడివి శేష్(Adivi Sesh) ‘గూఢచారి-2’(Goodachari-2)లో కీలక పాత్రలో కనిపించబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. వామికా హిందీలో ‘భూల్‌చుక్ మాఫ్’ చిత్రంలో నటిస్తోంది.
ఇందులో రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao)హీరోగా నటిస్తుండగా.. దీనిని కరణ్ శర్మ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 9న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, వామికా గబ్బి తన ఇన్‌స్టాగ్రామ్ ‘భూల్‌చుక్ మాఫ్’ ట్రైలర్‌ను షేర్ చేసింది. ఇక ఇందులో రాజ్ కుమార్, వామికా ప్రేమించుకుంటారు. ఇంట్లో వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో వీరిద్దరు ఇంట్లో నుంచి పారిపోతారు.
దీనిపై పెద్దలు కేసు పెట్టగా వారిని తీసుకొచ్చి పంచాయితీ పెడతారు. దీంతో వారిద్దరూ తమ తల్లిదండ్రులకు పెళ్లి చేసుకుంటామని చెప్తారు. ఇక దానికి వారు కూడా ఒప్పుకోవడంతో గ్రాండ్‌గా హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే పలు అవాంతరాలు ఎదురవుతాయి. చివరకు పెళ్లి ఆగిపోయే వరకు రాగా.. హీరో చనిపోవడానికి సిద్ధపడతాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. ఇక ఈ ట్రైలర్‌కు వామికా ‘‘అంతా తప్పుగా జరిగే పెళ్లి కోసం సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేసింది.






