- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టిన యంగ్ హీరోయిన్.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్(Khushi Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘స్పీకప్’ మూవీతో వచ్చిన ఆమె ది అర్చీస్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఇక గత ఏడాది ఆమె నడానియన్(Nadaaniyan), లవ్ యాప(Loveyapa) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన ఫొటోలతో ఖుషి కపూర్ స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆ భామ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే ది అర్చీస్ చేసిన కానుంచి ఆమె వేదాంగ్ రైనా(Vedang Raina)తో ప్రేమలో ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ వార్తలపై వీరిద్దరు స్పందించకపోవడంతో గత కొద్ది కాలంగా ఈ ప్రేమ పుకార్లు వస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఖుషి కపూర్ ఏకంగా ఓ చైన్ ధరించి ఆమె ప్రేమ విషయాన్ని ప్రకటించేసింది. వి లవ్ కె అనే లాకెట్ ధరించి పలు యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకుని వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో వీరి ప్రేమ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా ప్రేమ విషయాన్ని ఇలా కన్ఫార్మ్ చేసిందని చర్చించుకుంటున్నారు. అలాగే వి అంటే వేదాంగ్ అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఖుషి కపూర్ అందాన్ని పొగుడుతున్నారు. అయితే ఈ అమ్మడు అంతా అనుకున్నట్లుగానే వేదాంగ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఈ పోస్ట్ ద్వారా అందరికీ తెలిసేలా చేయడంతో ఆశ్చర్యపోతున్నారు.