హ్యాండ్‌సమ్ లుక్‌లో దర్శనమిచ్చిన యంగ్ హీరో.. అదిరిపోయే క్యాప్షన్‌తో పోస్ట్

by Gugulothu.Kavitha |

‘డిజే టిల్లు’(DJ Tillu) సినిమాతో స్టార్ బాయ్‌గా మారిపోయిన సిద్ధూ జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హ్యాండ్‌సమ్ లుక్‌లో దర్శనమిచ్చిన యంగ్ హీరో.. అదిరిపోయే క్యాప్షన్‌తో పోస్ట్
X

దిశ, సినిమా: ‘డిజే టిల్లు’(DJ Tillu) సినిమాతో స్టార్ బాయ్‌గా మారిపోయిన సిద్ధూ జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) చిత్రంతో మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక అతని యాడిట్యూడికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ప్రస్తుతం ఆయన ‘జాక్’(Jack), ‘తెలుసు కదా’(Telusu Kada) వంటి చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా సిద్ధూ.. తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో బ్లూ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ పై వైట్ డెనిమ్ షర్ట్ వేసుకొని హ్యాండ్ సమ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. అంతేకాకుండా వీటికి.. ‘తెలుసు కదా స్టిల్ రాజు’ అనే క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు డీజే టిల్లు మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘తెలుసు కదా’ చిత్రానికి నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రాశి ఖన్నా(Rashi Khanna), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్(TG Vishwa Prasad) హై బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు.

Next Story