- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతనితో లవ్‌లో పడ్డ యంగ్ బ్యూటీ.. లిప్‌లాక్‌తో కన్‌ఫాం చేసిందిగా.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు(పోస్ట్)
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi0 హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’(Godfather) సినిమాలో నయనతార(Nayanthara) చెల్లెలుగా నటించిన యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్(Thanya Ravichandran) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi0 హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’(Godfather) సినిమాలో నయనతార(Nayanthara) చెల్లెలుగా నటించిన యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్(Thanya Ravichandran) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ‘పేపర్ రాకెట్’(Paper Rocket) అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. అయితే ఈ చిన్నది కోలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ప్రస్తుతం ఈ భామ అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతుంది. అయితే రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ తన ప్రేమను సోషల్ మీడియా(Social Media) ద్వారా అధికారికంగా ప్రకటించింది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ పోస్ట్ పెట్టింది తాన్యా. అందులో “ఒక ముద్దు.. ఒక ప్రామిస్.. ఎప్పుడూ.. ఎప్పటికీ కలిసే”అంటూ ప్రియుడు అయిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్(Gowtham George)ను లిప్‌లాక్ చేస్తున్న ఫొటో షేర్ చేసింది. అంతేకాకుండా ఫొటోతో పాటు “#SoonToBeMarried” అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టడం ద్వారా పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ జంటకు సెలబ్రిటీలు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.






