- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చి షాకిచ్చిన యంగ్ బ్యూటీ.. బెండకాయ, దొండకాయ నువ్వే మా గుండెకాయ అంటూ కామెంట్స్
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’(Parada).

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’(Parada). లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత(Sangeetha), మలయాళ కుట్టి దర్శన రాజేంద్రన్(Darshana Rajendran) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీనివాసులు పీవీ(Srinivasulu PV), శ్రీధర్ మక్కువ(Sridhar Makkuva) నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న పరదా మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల జోరు పెంచేసింది అనుపమ పరమేశ్వరన్. ఇందులో భాగంగా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చి షాకిచ్చింది. అంతేకాకుండా ఈ ఫొటోలకు.. ‘పరదా మూవీని ప్రమోట్ చేయడానికి బొమ్మలు వేశారు’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు బెండకాయ, దొండకాయ.. అనుపమ మా గుండెకాయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






