అతను ముద్దు పెడుతున్న వీడియో షేర్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపిన యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Gugulothu.Kavitha |

‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అతను ముద్దు పెడుతున్న వీడియో షేర్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపిన యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా హెబ్బా పటేల్ ఓ చిన్న బాబుతో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అలాగే అతను హెబ్బాకు ముద్దు పెడుతున్న వీడియోకు కూడా షేర్ చేస్తూ.. ‘హన్నా ఖాలా అండ్ అమ్ముల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు లడ్డూ’ అనే క్యాప్షన్ జోడిస్తూ విష్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఆ చిన్నోడికి విషెస్ తెలుపుతున్నారు.

Next Story