- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లెస్సెడ్ బిగినింగ్స్ అంటూ అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ(Raviteja) నటించిన ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan) మూవీతో ఈ చిన్నది టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ అందుకుంది. కానీ ఈ చిన్నదాని అందంకి మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. ఇందులో భాగంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’(Andhra King Thaluka), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సరసన ‘కింగ్డమ్’(Kingdom) మూవీల్లో నటిస్తోంది.
అయితే కింగ్డమ్ మూవీకు గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా భాగ్యశ్రీ తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో విజయ్ దేవరకొండతో కారులో దిగిన క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘బ్లెస్సెడ్ బిగినింగ్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గామారింది. ఇకవాటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్‌తో పాటు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు.






