- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టు శారీలో ఫిదా అనిపిస్తున్న యంగ్ బ్యూటీ.. దేవతరా ఈ హీరోయిన్ అంటూ కామెంట్స్
‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినా ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్న ఈ చిన్నది.. రీసెంట్‌గా స్టార్ హీరో కార్తి(Karthi) నటించిన ‘అన్నగారు వస్తారు’(annagaru Vastharu) మూవీతో మన ముందుకు వచ్చింది.
నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టా(Instagram) అకౌంట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ పట్టు శారీ, మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుని, హెయిర్ లీవ్ చేసుకుని మెడకు నక్లెస్ పెట్టుకొని, చేతులకు గాజులు వేసుకుని కనిపించింది. సొట్ట బుగ్గలతో అందంగా నవ్వుతూ కొన్ని ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటికి ‘పట్టు శారీలో పట్టుమ’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు దేవత రా ఈ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






