మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. సో క్యూట్ అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

‘ఉప్పెన’(Upeena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ కృతిశెట్టి(Krithishetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. సో క్యూట్ అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’(Upeena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ కృతిశెట్టి(Krithishetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించింది. కానీ అనుకున్నంతగా హిట్ అయితే కాలేకపోయాయి. చివరగా నటించిన ‘మనమే’(Maname) సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్లు రాకుండానే పోయాయి. ఇక కోలీవుడ్‌కి చెక్కేసి అక్కడ అవకాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా రాణిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతిశెట్టి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకుని మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తుంది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story