- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. ఈసారి బొమ్మ అదిరిపోవాలంతే అంటూ కామెంట్స్
మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరిగా ఆయన నటించిన ‘మట్కా’(Matka) మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో మంచి బ్లాక్ బస్టర్ కల్ట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా ఎన్నడూ ట్రై చేయని జోనర్‌తో మన ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ‘వీటీ-15’(VT-15) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. ఇక ఇండో - కొరియన్ హారర్ కామెడీ థ్రిల్లర్‌తో రాబోతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్(UV Creations) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఓ యంగ్ బ్యూటీను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. గతంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ సిస్టర్‌గా కనిపించి ఆకట్టుకున్న రితిక నాయక్(Ritika Nayak). ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఎన్నో రోజులుగా మీ ఇద్దరికీ మంచి హిట్ లేదు కాబట్టి ఈసారి బొమ్మ అదిరిపోవాలంతే అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రితిక నాయక్ తేజ సజ్జ(Tejasajja) నటిస్తున్న 'మిరాయ్'(Mirai) సినిమాలోనూ నటిస్తుంది. Link






