Chiranjeevi: నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి.. తమన్‌పై చిరంజీవి ఆసక్తికర ట్వీట్

by Hamsa |
Chiranjeevi: నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి.. తమన్‌పై చిరంజీవి ఆసక్తికర ట్వీట్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజు’(Daaku Maharaja). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi), సౌజన్య నిర్మించారు. ఇందులో ప్రగ్యా, శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ క్రమంలో.. తమన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. కానీ ఒక విజయం సాధించాలంటే.. ఓ నిర్మాత ఉన్నాడు.

పనికిరాని ట్రోల్స్‌తో నెగెటివ్ ట్రెండ్‌లు చేస్తూ ఆ సినిమాను చంపేయకండి’’ అని చెప్పుకొచ్చారు. తాజాగా, ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పందించారు. ఈ మేరకు x ద్వారా ఓ పోస్ట్ కూడా పెట్టారు. ‘‘నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.

విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే. పదాలు స్ఫూర్తినిస్తాయి, నాశనం కూడా చేయగలవు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. ఆలోచనాత్మకమైన మాటలు నా ప్రియతమా గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా తమన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed