- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా జీవితంలోని మహిళలే మాకు గొప్ప బలం.. ఆ ఇద్దరితో ఉన్న ఫొటో షేర్ చేసిన చరణ్-ఉపాసన..
మెగా కపుల్ రామ్ చరణ్(Ram Charan)-ఉపాసన(Upasana) తాజాగా తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ పొందిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగా కపుల్ రామ్ చరణ్(Ram Charan)-ఉపాసన(Upasana) తాజాగా తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ పొందిన సంగతి తెలిసిందే. మెగా కోడలు ఉపాసన జనవరి 31 శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఓ బాబు, ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్-ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
‘మాకు ఒక మగబిడ్డ, ఆడపిల్ల పుట్టారని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు పుట్టడం మమ్మల్ని ఎంతో కృతజ్ఞతతో నింపుతుంది. మా జీవితంలోని మహిళలే మాకు గొప్ప బలం. ప్రతి క్షణం మాకు అండగా నిలిచి మద్దతు ఇచ్చిన మా అభిమానులు, కుటుంబ సభ్యులు& శ్రేయోభిలాషులందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక బ్లాక్ అవుట్ ఫిట్‌లో రామ్ చరణ్ అండ్ బేబీ బంప్‌తో ఉపాసన, బ్లాక్ కలర్ బిగ్ డాగ్స్‌తో తీసుకున్న ఓ క్రేజీ ఫొటో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట వైల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






