- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నరేష్-పవిత్రకు ఊహించని షాకిచ్చిన మహిళ.. ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామంటూ ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర(pavithra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్రpavithra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరికీ పెళ్లై లేట్ వయసులో ప్రేమించుకుని ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. అప్పట్లో నరేష్, పవిత్ర సెన్సేషనల్‌గా మారారు. వీరిద్దరు లిప్‌లాక్ ఇచ్చుకున్న వీడియోను షేర్ చేయడంతో నరేష్ మూడో భార్య కేసు పెట్టగా.. కొద్ది కాలంపాటు ఈ వివాదం కొనసాగింది. ఇక వీరిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం నరేష్ వరుస సినిమాల్లో నటిస్తుండగా.. పవిత్ర ఇంట్లోనే ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరు పలు ఈవెంట్లకు కలిసి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నరేష్, పవిత్రకు ఓ మహిళ ఊహించని షాకిచ్చింది. వీరిద్దరు వెకేషన్‌కు వెళ్తుండగా.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వీరికి ఓ గిఫ్ట్ ఇచ్చింది.
ఈ విషయాన్ని తెలుపుతూ నరేష్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఆమె ఎవరో తెలియదు కానీ, హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను, నన్ను కలిసి.. మీరు ఆమెపై శ్రద్ధ, ప్రేమ మీరు ఆమెను అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకున్నాయి. మీరు గొప్ప పెద్దమనిషి. మీ జీవితంలో ఆమెను కలిగి ఉండటం అదృష్టం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి వెళ్లిపోయింది. మాకు కొన్ని స్వీట్లు బహుమతిగా ఇచ్చింది. ఆమె మాటలు, ముఖంలోని నిజాయితీ అన్నీ చెప్పాయి. మీరు ఎవరైనా, మేము మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాము. మా జీవితంలో అత్యంత హత్తుకునే క్షణం ఇదే.. మీకు ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం నరేష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






