టీ20ల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన పొలార్డ్.. గేల్ రికార్డు బద్దలు

by Harish |

వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ కీరన్ పొలార్డ్ టీ20ల్లో వరల్డ్ రికార్డు సృష్టించాడు.

టీ20ల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన పొలార్డ్..  గేల్ రికార్డు బద్దలు
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ కీరన్ పొలార్డ్ టీ20ల్లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఇంతకుముందు ఈ ఘనత తన సహచరుడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 436 టీ20ల్లో 14,562 పరుగులు చేశాడు. తాజాగా అతని రికార్డును పొలార్డ్ బద్దలుకొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఎంఐ న్యూయార్క్ ఆడుతున్న పొలార్డ్ శనివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ పర్ఫామెన్స్‌తో పొలార్డ్.. గేల్‌ను అధిగమించాడు. 736 మ్యాచ్‌ల్లో 14,582 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ జాబితాలో పొలార్డ్, గేల్ తర్వాత మూడో స్థానాలో అలెక్స్ హేల్స్(14,449), జోస్ బట్లర్(14,371), డేవిడ్ వార్నర్(14,284), విరాట్ కోహ్లీ(14,218) ఉన్నారు. పొట్టి ఫార్మాట్‌లో 700లకుగాపై మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్ పొలార్డే. ఇక, పొలార్డ్ మెరుపు శతకం బాదినప్పటికీ తన జట్టు ఎంఐ న్యూయార్క్‌ను గెలిపించలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 30 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా ఆ జట్టు 245/5 స్కోరుగా చేయగా.. ఎంఐ న్యూయార్క్ 215/6 స్కోరుకే పరిమితమైంది.

Next Story