- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ కీలక శాంతి చర్చలు.. ప్రత్యేక ఆకర్షణగా ట్రంప్ అల్లుడు!
స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ అమెరికా తరఫున పాల్గొనగా, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేతృత్వంలోని బృందం హాజరైంది. గతవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కుదిరిన అవగాహన ఒప్పందం అమలుపై, ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, లెబనాన్‌లో కాల్పుల విరమణ వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న దాడులు ఒప్పందానికి సవాలుగా మారాయి.
ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగా హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు ప్రకటించగా, అమెరికా ఆ వాదనను ఖండించింది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ, ప్రాంతీయ శాంతి, భద్రత అంశాలు కూడా చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా జ్యూరిచ్‌కు చేరుకున్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, సమావేశానికి ముందు జేడీ వాన్స్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. అయితే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కీలక శాంతి చర్చల్లో ట్రంప్ అల్లుడు రావడంపై చర్చానీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. అతనికి ఇక్కడ పనేంటని పలువురు నెటిజన్‌లు భావిస్తున్నారు.






