- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ విద్యార్థి కోసం రాష్ట్రపతి నిలయం గేట్లు ఓపెన్..
ఆదివారం హైదరాబాద్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

దిశ, సిటీక్రైం: ఆదివారం హైదరాబాద్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అనూహ్య పరిస్థితుల్లో ఓ విద్యార్థి కోసం బొల్లారం రాష్ట్రపతి గేట్లను తెరిచి అతనిని సమయానికి నీట్ పరీక్ష కేంద్రానికి పోలీసులు చేర్చారు. ఐదు నిమిషాలకు ముందే విద్యార్థి పరీక్ష కేంద్రానికి చేరుకోవడం పోలీసులతో పాటు విద్యార్ధుల తల్లిదండ్రులు తోటి విద్యార్ధులు ఊపీరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన హాసన్ హాష్మీ నీట్ పరీక్ష రాస్తున్నాడు. అతని పరీక్ష కేంద్రం కేంద్రీయ విద్యాలయ బొల్లారంలో పడింది.
పోలీసులకు సెల్యూట్..
అయితే హాసన్ హాష్మీ తన తండ్రితో కలిసి కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరికి 1.20 గంటలకు చేరుకున్నాడు. కాని అతని కేంద్రం ఇది కాదు బొల్లారం అని తెలుసుకుని ఒకసారిగా కన్నీరు పెడుతు గందరగోళానికి గురయ్యాడు. అతని తండ్రి కూడా దిక్కుతోచక సతమతం అవుతున్నారు. ఈ సందర్భంలో అక్కడి విధులను నిర్వహిస్తున్న ఆల్వాల్ డివిజిన్ ఏసీపీ రమేశ్ తన కారులో విద్యార్ధిని ఎక్కించుకుని పరీక్ష కేంద్రానికి ప్రయాణమైయ్యాడు. ఐదు నిమిషాల్లో పరీక్ష కేంద్రానికి వెళ్ళాల్సి ఉండడంతో పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి.. ఏకంగా బొల్లారం రాష్ట్రపతి నిలయం గేట్లను తెరిపించి అత్యంత వేగంగా విద్యార్ధిని ని పరీక్ష కేంద్రానికి చేరిపించి అతనిని సమయానికి ముందే నీట్ ఎగ్జామ్ రాసేందుకు పంపించారు. ఈ విధంగా మల్కాజిగిరి పోలీసులు అందించిన సేవలకు అందరూ ఖుషి అయ్యి ప్రశంసలు కురిపించి, పోలీసులకు సెల్యూట్ చేశారు.






